ASR: రింతాడ జీటీడబ్ల్యూ బాలికల వసతి గృహంలో మంగళవారం జీకేవీధి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ శివరామ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులకు మలేరియా పరీక్షలు నిర్వహించగా ఎవరికీ మలేరియా నిర్ధారణ కాలేదు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. వంటగది, మరుగుదొడ్లను పరిశీలించి పరిశుభ్రతపై సిబ్బందికి సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
బాలికల వసతి గృహంలో వైద్య శిబిరం


