కృష్ణా: తాగునీటి సమస్య పరిష్కారం కావడం లేదని నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం పంచాయతీ పరిధిలోని 1వ వార్డు ప్రజలు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చారు. 30 ఏళ్లుగా సమస్య వేధిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ మేరకు ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి సమస్యపై ఎన్నికల బహిష్కరణ


