హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకివీడులో వరద ప్రాంతాల పరిశీలన

W.G: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆకివీడులోని సమతనగర్‌ వీరమల్లు కాలనీ నీటమునిగింది. ఈ నేపథ్యంలో ఉండి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ మంతెన యోగేంద్ర బాబు మంగళవారం కాలనీని సందర్శించి ముంపు పరిస్థితులను పరిశీలించారు. వర్షాలు తగ్గి వారం రోజులు గడుస్తున్నా కాలనీలో నీరు తగ్గకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.