BPT: చీరాల తీర ప్రాంతంలో పర్యాటకుల సెల్‌ఫోన్లు దొంగిలిస్తున్న అడవి పల్లెపాలెంకు చెందిన ఓరుపుల చిన్నను ఈపూరుపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. దేసు పవన్ కుమార్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నిందితుడి వద్ద నుంచి రూ. 4 లక్షల విలువైన 14 చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సీఐ సుధాకర్ తెలిపారు. తీరంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
తీర ప్రాంతంలో సెల్‌ఫోన్ల దొంగ అరెస్ట్


