హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లో డబ్బు ప్రభావంపై సీపీఐ ఆగ్రహం

KKD: యు.కొత్తపల్లి మండలంలో స్థానిక ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా డబ్బు, మద్యంతో వ్యాపారంలా సాగుతున్నాయని సీపీఐ నేత సాకా రామకృష్ణ మంగళవారం ప్రెస్ మీట్‌లో విమర్శించారు. సర్పంచ్ పదవులకు రూ.50 లక్షల నుండి కోటి వరకు ఖర్చు చేస్తుండటంతో సామాన్యులకు అవకాశం దక్కడం లేదన్నారు. ఓటర్లు నోట్లకు అమ్ముడుపోవద్దని, అక్రమాల కట్టడిలో ఈసీ విఫలమైందని ఆయన మండిపడ్డారు.