హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా మహిళా కాంగ్రెస్ పగ్గాలు అపర్ణకు..

NRML: జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మేడారం అపర్ణ ప్రదీప్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆమెకు నియామకపత్రాన్ని అందజేశారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని అపర్ణ తెలిపారు. పార్టీ అభ్యున్నతికి కృషి చేయడంతో పాటు జిల్లాలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకు పనిచేస్తానని పేర్కొన్నారు.