హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జంఝావతి పూర్తయ్యే వరకు పోరాటం'

PPM: జంఝావతి ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో రైతులు సాగునీటి కోసం ఎదురుచూడాల్సి వస్తోందని సాధన సమితి సభ్యుడు కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ఆయకట్టు రైతులకు సమృద్ధిగా నీరందించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం 57వ రోజు చేపట్టిన దీక్షల్లో ఆయన మాట్లాడారు. పనులు ప్రారంభించే వరకు శాంతియుత నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.