శ్రీకాకుళం: టెక్కలిలోని గోపినాథపురంలో మంగళవారం విషాద ఘటన జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. మందస (మ) మకరజోలకు చెందిన ధనుశ్ (21) అనే ఇంజినీరింగ్ విద్యార్థి తన తమ్ముడు కుమార్తో కలిసి గోపినాధపురంలో అమ్మమ్మ ఇంటికి వచ్చారు. ఇరువురు స్నానానికి చెరువు వద్దకు వెళ్లారు. తమ్ముడు కుమార్ నీటిలో మునిగిపోతుండగా కాపాడేందుకు వెళ్లిన అన్నయ్య ధనుష్ ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి మృతి చెందాడు.
ఆంధ్రప్రదేశ్
తమ్ముడిని కాపాడి అన్నయ్య మృతి


