హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్

కాకినాడ నగరంలోని ఓ దుకాణంలో జరిగిన చోరీకి సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 9 లక్షల నగదు, వెండి కడ్డీలతో పాటు 1.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ కిషోర్ కుమార్ వెల్లడించారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ దుర్గారావుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.