హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్వాన్ తుఫాన్‌తో జిల్లాకు ముప్పు

కోనసీమ: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అక్వాన్ తుఫాన్ తీరం దాటే దిశ మారడంతో కోనసీమ ప్రాంతానికి ముప్పు పొంచి ఉంది. కాకినాడకు దక్షిణంగా, మచిలీపట్నంకు ఉత్తరంగా తీరం దాటే అవకాశం ఉందని అంచనా. కోరంగి, ఉప్పాడ తీర ప్రాంతాల్లో సముద్ర అలల ఉద్ధృతి, ఉప్పెన ప్రమాదం ఉండటంతో తీరప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.