హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు తీరంలో ముందుకొచ్చిన సంద్రం

అక్వాన్ తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లా తీరం వెంబడి పలుచోట్ల సముద్రం 50 నుంచి 200 మీటర్ల వరకు ముందుకు వచ్చింది. జువ్వల దిన్నె హార్బర్‌లో 80కి పైగా బోట్లు నిలిచిపోయాయి. సముద్రంలో వేట నిలిపారు. మత్స్యకారులు తీరానికే పరిమితమయ్యారు. కృష్ణపట్నం పోర్టులో 3వ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. తుపాను తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.