NRML: తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026కు నిర్మల్ జిల్లా పోలీస్ సిబ్బంది సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా నిర్మల్, భైంసా డివిజన్ల సిబ్బందికి స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి కిట్లను అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ డా. జి. జానకి షర్మిల, డీఎస్పీ పి. శ్రీనివాస్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
పోలీస్ సిబ్బందికి స్పోర్ట్స్ కిట్ల పంపిణీ


