హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం

ప్రకాశం: ఒంగోలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్లమెట్ట నుంచి నంది విగ్రహం వెళ్లే మార్గంలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. ఈ విషయాన్ని స్థానికులు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలియవలసి ఉంది. పోస్టుమార్టం కొరకు మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.