హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 28, 29వ తేదీల్లో టీఏజీఎస్ రాష్ట్ర మహాసభలు

ADB: ఈ నెల 28, 29 తేదీల్లో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (TAGS) రాష్ట్ర మహాసభలు, బహిరంగ సభను ఆసిఫాబాద్‌లో నిర్వహించనున్నట్లు సంఘం నాయకులు తెలియజేశారు. ఈ మేరకు ఉట్నూర్ మండల కేంద్రంలో మంగళవారం సమావేశమై కార్యక్రమం గోడప్రతులను ఆవిష్కరించారు. ఆదివాసులు, ప్రజలు పెద్దఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.