హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తాం: కలెక్టర్

పశ్చిమగోదావరి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తాడేపల్లిగూడెం డివిజన్‌లోని ఆరు మండలాల్లో 29న పోలింగ్‌, అదే రోజు లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు. 121 పంచాయతీలు, 1,288 వార్డులకు 1,372 కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రజలు నిర్భయంగా ఓటేయాలని కోరారు.