హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లింగపాలెంలో పెద్దపులి కలకలం

ELR: లింగపాలెం సమీప పొలాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ గుర్తించింది. వీహెచ్‌ఎఫ్ పరికరాల ద్వారా దాని కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. పులిని మత్తుమందు ఇచ్చి బంధించేందుకు పుణె నుంచి ప్రత్యేక బృందం రానుంది. పోలీసు, రెవెన్యూ శాఖల సహకారంతో చర్యలు చేపడుతున్నామని DFO సందీప్‌రెడ్డి తెలిపారు. రైతులు, కూలీలు, పశువుల కాపరులు పొలాలకు వెళ్లవద్దని హెచ్చరించారు.