కోనసీమ: అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు జిల్లా పరిషత్ హైస్కూల్లో రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు జక్కంపూడి కిరణ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గత 20 రోజులుగా చిక్కీలు అందడం లేదని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన వెంటనే డీఈఓకు ఫోన్ చేసి జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు చిక్కీల సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'పాఠశాలలో ఆహార కమిషన్ సభ్యుల ఆకస్మిక తనిఖీ'


