SDPT: పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ పాఠశాలల స్కావెంజర్లు ఆందోళనకు దిగారు. సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. నెలల తరబడి పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో భాగంగా కొందరు స్కావెంజర్లు కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి బైఠాయించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
తెలంగాణ
వేతనాల కోసం స్కావెంజర్ల పోరుబాట


