హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒకే కుటుంబం నుంచి ముగ్గురి నామినేషన్లు

ELR: పోలవరం పంచాయతీ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు వేర్వేరు పదవులకు నామినేషన్లు దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. అక్క ప్రగడ విజయలక్ష్మి సర్పంచ్ అభ్యర్థిగా, తల్లి పసుపులేటి చంద్రకళ 11వ వార్డు సభ్యురాలిగా, తమ్ముడు పసుపులేటి అనిల్ 1వ వార్డు సభ్యుడిగా బరిలో నిలిచారు. ముగ్గురూ ఏ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయడం విశేషం.