హైదరాబాద్: 28°C
వార్తలు

దేశ చరిత్రలో తొలిసారి విదేశీ నిందితుడి అప్పగింత

జాతీయ దర్యాప్తు సంస్థ సీబీఐ చరిత్ర సృష్టించింది. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసుతో ఓ మోసం కేసులో నిందితుడిగా ఉన్న ఉక్రెయిన్ పౌరుడు ఒలెక్సాండర్ జాపిచెంకోనును సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి భారత్‌కు తీసుకువచ్చారు. ఇలా ఒక విదేశీ నిందితుడిని భారత్‌కు తీసుకునిరావడం ఇదే తొలిసారి. ఒలెక్సాండర్ ముంబైలో రూ.177 కోట్ల పెట్టుబడుల మోసం కేసులో నిందితుడిగా ఉన్నాడు.