హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అల్లర్లు సృష్టిస్తే కేసులు నమోదు: ఎస్పీ

VZM: జిల్లాలో మూడు విడతల్లో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు పటిష్ఠమైన ముందుస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ దామోదర్ మంగళవారం ఆదేశించారు. గ్రామాల్లో రాజకీయ, వ్యక్తిగత కక్షలతో అల్లర్లు సృష్టించే వారిని ముందుగా గుర్తించి వారిపై పూచీకత్తులు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలన్నారు.