హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దొంగల బెడదతో స్థానికుల ఇబ్బందులు

GNTR: తెనాలి జగ్గడిగుంటపాలెంలోని టిడ్కో గృహాల వద్ద దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల ముందు నిలిపిన ఆటోల టైర్లు, బండ్లలోని ఆయిల్, సామగ్రి చోరీకి గురవుతున్నాయని, రాత్రివేళల్లో మహిళలు, చిన్నపిల్లలు బయటకు రావాలంటే భయపడుతున్నామని తెలిపారు. పోలీసులు గస్తీ పెంచి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.