హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శెట్టివారిపల్లెలో ఆరోగ్య శాఖ ప్రత్యేక సర్వే

KDP: మైదుకూరు పురపాలక పరిధిలోని శెట్టివారిపల్లెలో పట్టణ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఫీవర్ సర్వే, దోమల లార్వా సర్వే చేపట్టారు.ఈ సర్వేలో మొత్తం నాలుగు వైరల్ ఫీవర్ కేసులు గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. బాధితులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశామన్నారు.