అనకాపల్లి బుద్ధ గంగునాయుడు వీధిలో వినాయకుడి ఆలయం సమీపంలో విద్యుత్ వైర్లు తెగి ఇళ్లపై పడటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వర్షాకాలంలోనూ విద్యుత్ సరఫరా కొనసాగుతుండటంతో ప్రాణాపాయం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి ప్రమాదకర వైర్లను తొలగించి, శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
అనకాపల్లిలో ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు


