హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ

BPT: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ ఆదేశాలతో నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.