హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసరావుపేటలో ఉద్రిక్త వాతావరణం

PLD: నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం నామినేషన్ కేంద్రం వద్దకు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేరుకున్నారు. వార్డు కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్లను తొలుత ఆమోదించి, అనంతరం ఎలా తిరస్కరిస్తారంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌తో మాట్లాడాలని, లేనిపక్షంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగుతామని హెచ్చరించారు.