NZB: యువతలో సేవాభావం, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు పెంపొందాలని టూటా అధ్యక్షుడు డాక్టర్ ఎ. పున్నయ్య అన్నారు. అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ యూనిట్-1 ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు సామాజిక సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని సూచించారు.
తెలంగాణ
'యువతతోనే సమాజ వికాసం'


