హైదరాబాద్: 28°C
క్రీడలు

ధోనీ కెప్టెన్సీలో చెన్నై అరుదైన రికార్డులు

IPL తొలి సీజన్ 2008 నుంచి ధోనీ CSKతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. తొలి వేలంలో రూ.6 కోట్లకు CSK అతడిని కొనుగోలు చేసింది. ఆ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ధోనీ నిలిచాడు. అతడి నాయకత్వంలో చెన్నై ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ సాధించింది. 2010, 2014లో ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీలను గెలుచుకుంది. IPLలో 12 సార్లు ప్లేఆఫ్స్‌కు, 10 సార్లు ఫైనల్స్‌కు చేరి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.