హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. చెన్నై సూపర్ కింగ్స్ అతడిని జట్టు మెంటార్‌గా ప్రకటించింది. ఇప్పటివరకు తన నాయకత్వంతో సీఎస్‌కేకు ఎన్నో విజయాలు అందించిన ధోనీ, ఇకపై యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. చెన్నై జట్టుతో ధోనీకి ఉన్న అనుబంధం ప్రత్యేకమని యాజమాన్యం పేర్కొంది.