హైదరాబాద్: 28°C
వార్తలు

క్షిపణి దాడి.. నౌకలో 24 మంది భారతీయులు!

హర్మూజ్ జలసంధిలో LPG ట్యాంకర్‌పై క్షిపణి దాడి జరిగిందని కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. ఆ సమయంలో నౌకలో 25 మంది సిబ్బంది ఉన్నారని.. వారిలో 24 మంది భారతీయ నావికులు ఉన్నట్లు వెల్లడించారు. అయితే వారంతా సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. వారి భద్రత, క్షేమాన్ని నిర్ధారించేందుకు సంబంధిత అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు.