హైదరాబాద్: 28°C
వార్తలు

ఈసీ పనితీరుపై విపక్షాల పిటిషన్ల విచారణ వాయిదా

ఈసీ పనితీరును ప్రశ్నిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సహా ఇండీ కూటమి నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈసీ తీసుకుంటున్న కీలక నిర్ణయాల విషయంలో మిగిలిన ఇద్దరి కమిషనర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వాదనల అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 09కి వాయిదా వేస్తూ సుప్రీం ఆదేశించింది.