హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం

SKLM: మందస ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో మందస, హరిపురం పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు స్థానిక డిగ్రీ కళాశాలలో రెండో విడత శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. సీడీపీఓ అరుణ, ప్రిన్సిపాల్ శివ, సూపర్‌ వైజర్ జ్యోతి చిన్నారుల ఎదుగుదల, పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ, ఆటల ద్వారా విద్యాబోధన, తక్కువ ఖర్చుతో బోధనా సామగ్రి తయారిపై శిక్షణ ఇచ్చారు.