హైదరాబాద్: 28°C
వార్తలు

‘యాక్ట్ ఈస్ట్ పాలసీతో కొత్త ఊపు వచ్చింది’

ప్రపంచం కొన్నేళ్లుగా అనేక సవాళ్లను ఎదుర్కొందని, నేటి సమాజానికి శాంతి, స్థిరత్వం అవసరమని ప్రధాని మోదీ అన్నారు. యాక్ట్ ఈస్ట్ పాలసీతో భారత్-ఆసియాన్ సంబంధాలకు కొత్త ఊపు వచ్చిందన్నారు. ప్రజల మధ్య సంబంధాలు పెంచేందుకు 100కు పైగా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అలాగే డిజిటల్ టెక్నాలజీ, రక్షణ, అంతరిక్ష రంగాల్లోనూ కొత్త కోణాలను అన్వేషిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు.