హైదరాబాద్: 28°C
వార్తలు

ALERT: దూసుకొస్తున్న 'అక్వాన్' తుఫాన్

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన 'అక్వాన్' తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. ఈ తుఫాన్.. సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. గడిచిన 6 గంటల్లో గంటకు 3కి.మీ. వేగంతో కదులుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ తుఫాన్ చెన్నైకి 610 కి.మీ., మచిలీపట్నానికి 660 కి.మీ., విశాఖకు 670 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని SDMA MD ప్రఖర్ జైన్ తెలిపారు.