హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్లోఅవుట్‌ ఘటన.. పవన్ ఏమన్నారంటే?

కోనసీమ జిల్లాలో బ్లోఅవుట్‌ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆరా తీశారు. ఘటన జరిగిన ప్రాంతంలోని ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వరుస బ్లోఅవుట్‌ ఘటనల నేపథ్యంలో ఆయిల్‌, గ్యాస్‌ సంస్థల భద్రతా ప్రమాణాలపై సమగ్ర సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించాలని సూచించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.