హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినులకు అస్వస్థత

ATP: గుమ్మగట్ట మండలంలోని కేజీబీవీ పాఠశాలలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, తలనొప్పి, కడుపునొప్పితో బాధపడుతున్నారు. ప్రస్తుతం 8 మందికి గుమ్మగట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. మరో 40 మంది వరకు విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. కలుషిత ఆహారం కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.