GDWL: కేటీదొడ్డి మండలం చింతలకుంట గ్రామంలోని ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. గుంతల్లో మురుగునీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. ఈ మార్గంలో కర్ణాటకలోని రాయచూరు జిల్లాకు పనుల నిమిత్తం వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతల్లో ప్రయాణించాలంటే భయంగా ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
చింతలకుంటలో రహదారిపై మురుగునీరు


