BHNG: రైతుల వ్యవసాయ మోటార్లను దొంగిలిస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను మోత్కూరు పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.2 లక్షల విలువైన 18 విద్యుత్ మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. చోరీలకు ఉపయోగించిన వాహనంతో పాటు ఇతర సామగ్రిని కూడా పోలీసులు సీజ్ చేశారు. నిందితులు మోత్కూరు పరిసర గ్రామాలకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
తెలంగాణ
వ్యవసాయ మోటార్ల దొంగల ముఠా అరెస్ట్!


