హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓయూ హాస్టల్లో పురుగుల భోజనంపై విద్యార్థుల ఆందోళన

HYD: ఉస్మానియా విశ్వవిద్యాలయం హాస్టళ్లలో వడ్డిస్తున్న భోజనం అపరిశుభ్రంగా ఉందంటూ సోమవారం విద్యార్థినులు పోలీసుల సమక్షంలో ఆందోళన చేశారు. ఎంబీఏ, లా, నిజాం కాలేజీ విభాగాలకు చెందిన సుమారు 100 మంది అన్నం, కూరల ప్లేట్లు ముందుంచి నినాదాలు చేశారు. భోజనంలో పురుగులున్నాయని, పలుమార్లు విన్నవించినా వార్డెన్లు పట్టించుకోలేదని ఆరోపించారు.