JGL: అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తీన్‌ఖని చౌరస్తా వద్ద శ్రీరాం టైలర్స్ నిర్వహిస్తున్న శంకర్ (42) మంగళవారం తన దుకాణంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాపారం సరిగా సాగకపోవడం, అప్పులు పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
అప్పుల భారంతో టైలర్ ఆత్మహత్య!


