హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలుపు మొక్కతో అందమైన అలంకరణ సామగ్రి తయారీ

WG: జల వనరులకు పెను భారంగా మారే గుర్రపుడెక్క మొక్కలతో.. మొగల్తూరు మండలం కొత్తోట మహిళలు అద్భుతమైన కళాఖండాలను రూపొందిస్తున్నారు. సహజ సిద్ధంగా పెరిగే గుర్రపుడెక్క కాడలను ఉపయోగించి వీరు తయారు చేస్తున్న గృహోపకరణ, అలంకరణ సామగ్రి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కేంద్ర జౌళి, మంత్రిత్వశాఖ సహాయ సంచాలకురాలు అపర్ణలక్ష్మి ..గుర్రపుడెక్క కాడలతో గృహోపకరణాలు, అలంకరణ సామగ్రి తయారీపై ఇటీవల శిక్షణ ఇచ్చారు.