హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వార్డు రిజర్వేషన్లపై చెరువు ఉప్పరపాలెం వాసుల ఆందోళన

BPT: బాపట్ల మండలం చెరువు ఉప్పరపాలెం వాసులు మంగళవారం నిరసన బాట పట్టారు. జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. గ్రామంలో 600 పైగా ఓట్లు ఉండగా, అందరూ బీసీలేనని తెలిపారు. అయినప్పటికీ వార్డులను ఎస్సీలకు కేటాయించడం అన్యాయమని మండిపడ్డారు. ఇది తమను అవమానించినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రిజర్వేషన్లు సవరించాలని కోరారు.