హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారులకు చిక్కిన 23 కేజీల భారీ చేప

ELR: జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి ఎర్రకాలువ జలాశయంలో మంగళవారం 23 కేజీల చేప మత్స్యకారులకు చిక్కింది. గ్రామానికి చెందిన భోజన రాజు తన తోటి మత్స్యకారులతో కలిసి ఈరోజు ఉదయాన్నే వేటకు వెళ్లారు. ఈ క్రమంలో వలకు భారీ చేప చిక్కడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఈ చేపను సుమారు 7వేలకు విక్రయించినట్లు తెలియజేశారు. ఈ భారీ చేపను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు.