కోనసీమ జిల్లా నగరం గ్రామం వద్ద చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ ఘటనపై మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరా తీశారు. ఘటనకు సంబంధించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
గ్యాస్ లీకేజీ ఘటనపై మంత్రి వాసంశెట్టి ఆరా!


