హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చల్వాయిలో రూ.3.19 కోట్లతో విద్యుత్ ఉపకేంద్రం

MLG: గోవిందరావుపేట మండలం చల్వాయిలో రూ.3.19 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి ఇవాళ మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. దీని ద్వారా చల్వాయి, మాచాపూర్, బుస్సాపూర్ గ్రామాల్లో 1,550 మంది వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందుతుందని తెలిపారు. పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.