హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతీ ఒక్కరికి ప్రయోజనాలు అందేలా కృషి: MLA

MHBD: ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ నిర్ణయాల ద్వారా పేద కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు, సామాజిక భద్రతకు భరోసా కల్పిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తెలిపారు. తొర్రూరులో 1,169 మంది అర్హులైన లబ్ధిదారులకు నేడు పెన్షన్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.