హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆ గ్రామాల్లో తొలిసారి పంచాయతీ ఎన్నికలు

NTR: విజయవాడ రూరల్‌ పరిధిలోని రామరాజునగర్‌, YSR గ్రామ పంచాయతీల్లో తొలిసారిగా ఎన్నికల సందడి నెలకొంది. గతంలో గొల్లపూడి, జక్కంపూడి పంచాయతీల పరిధిలో ఉన్న ఈ ప్రాంతాలను YCP ప్రభుత్వ హయాంలో కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. 2021లో ఎన్నికలు జరగకపోవడంతో ఇక్కడి ప్రజలకు తొలిసారి సర్పంచి, వార్డు సభ్యులను ఎన్నుకునే అవకాశం వచ్చింది.