హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. అన్నదాన సత్రంలో భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. ఆంజనేయస్వామి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.