హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలికల పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి పొన్నం

SDPT: ఎల్కతుర్తి సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందించాలని సూచించారు. ప్రతి విద్యార్థిని ప్రాథమికంగా ఇంగ్లిష్ మాట్లాడేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.