హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలేరు కవికి రాష్ట్రస్థాయి పదవి

BHNG: తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర కోశాధికారిగా ఆలేరు పట్టణానికి చెందిన కవి డాక్టర్ పోరెడ్డి రంగయ్య ఎంపికయ్యారు. తెరసం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాళేశ్వరం శంకరం ఈ విషయాన్ని ప్రకటించారు. గత మూడు దశాబ్దాలుగా సాహిత్య రంగానికి ఆయన సేవలు అందిస్తున్నారు. ఈ నియామకం పట్ల పలువురు సాహిత్య ప్రముఖులు, జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ప్రత్యేకంగా అభినందించారు.